దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని

- November 12, 2026 , by Maagulf
దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని

దోహా: భారత కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఖతార్‌లో భారత రాయబారి శ్రీకర్ కొప్పుల ఘన స్వాగతం పలికి, సాదరంగా ఆహ్వానించారు.

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లీనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2026 (ITU PP-26)**లో పాల్గొనేందుకు కేంద్ర సహాయ మంత్రి దోహా పర్యటనకు వచ్చారు.

రానున్న రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన విధానాలు, అంతర్జాతీయ సహకారం, డిజిటల్ కనెక్టివిటీ వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి.

ఈ పర్యటనతో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ రంగంలో భారత్ భాగస్వామ్యం, సహకారానికి మరింత ప్రాధాన్యత లభించనుంది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com