ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- November 12, 2026
దోహా: దోహాలో జరుగుతున్న అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్లీనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2026 (ITU PP-26) సందర్భంగా భారత్ పలు దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించింది. అజర్‌బైజాన్, జపాన్, నేపాల్, ఎస్టోనియా దేశాల ప్రతినిధులతో భారత ప్రతినిధులు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
ఈ సమావేశాల్లో కృత్రిమ మేధ (AI) అభివృద్ధి, నియంత్రణ విధానాలు, తదుపరి తరం సాంకేతికతలు, సైబర్ భద్రత, టెలికాం భద్రత, డిజిటల్ సేవలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.
అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించేందుకు ఉపయోగపడే 'సెల్ బ్రాడ్‌కాస్ట్' (Cell Broadcast) సాంకేతికతను వేగంగా అందుబాటులోకి తీసుకురావడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా భాగస్వామ్య దేశాల ప్రతినిధులను ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)కు హాజరు కావాల్సిందిగా భారత ప్రతినిధులు ఆహ్వానించారు.
ఉమ్మడి విలువలు, లోతైన సాంస్కృతిక సంబంధాల ఆధారంగా వివిధ దేశాలతో కలిసి సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని భారత ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
- KD 3,000 లోపు లావాదేవీలపైనా సెంట్రల్ బ్యాంక్ నిఘా..!!
- సౌదీ భద్రతే బహ్రెయిన్, జీసీసీ దేశాల భద్రత..!!
- ఐఎండీ 2026 ఏఐ ర్యాంకింగ్స్..సత్తా చాటిన సౌదీ..!!
- దుబాయ్‌లో ప్రవాసీ భారతీయ దివస్ 2027 అధికారిక వెబ్సైట్ ప్రారంభం
- యూఏఈ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం







