తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
- November 12, 2026
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం అత్యంత భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 21 మంది సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా (జీఓ ఆర్టీ నెం. 1654) ఉత్తర్వులు జారీ చేశారు. లా అండ్ ఆర్డర్, ఏసీబీ, సీఐడీ, మహిళా భద్రత, ట్రాఫిక్ తదితర కీలక విభాగాల్లో ప్రక్షాళన చేస్తూ ఈ కొత్త పోస్టింగ్‌లను కేటాయించారు.
హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్ నియామకం
ఈ భారీ బదిలీల్లో భాగంగా రాజధాని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త సారథిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు డీజీపీ (లా అండ్ ఆర్డర్) బాధ్యతలు నిర్వర్తించిన 1995 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ నగర కొత్త సీపీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
2. వీసీ సజ్జనార్: డీజీ (తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్), ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు
3. డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్): డీజీపీ (మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా), ఏడీజీపీ (ఆర్గనైజేషన్ & లీగల్)గా అదనపు బాధ్యతలు
4. స్వాతి లక్రా (1995 బ్యాచ్): జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్, హోంగార్డ్స్ డీజీపీగా అదనపు బాధ్యతలు
5. చారు సిన్హా (1996 బ్యాచ్): ఏసీబీ డైరెక్టర్ జనరల్, సీఐడీ డీజీపీగా అదనపు బాధ్యతలు
6. డా. అనిల్ కుమార్ (1996 బ్యాచ్): టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్
7. వై. నాగిరెడ్డి (1997 బ్యాచ్): పౌరసరఫరాల శాఖ కమిషనర్ & ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ (+ లీగల్ మెట్రాలజీ)
8. విక్రమ్ సింగ్ మాన్ (1998 బ్యాచ్): గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ డీజీపీ (ఆపరేషన్స్), పోలీస్ హౌసింగ్ విభాగం
9. ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999 బ్యాచ్): టీజీ-టీఎంఏఆర్ఎస్ (TG-TMARS) డైరెక్టర్
10. అకున్ సబర్వాల్ (2001 బ్యాచ్): అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్), కోఆర్డినేషన్ & టెక్నికల్ సర్వీసెస్
11. సంజయ్ కుమార్ జైన్: అదనపు డీజీపీ (ట్రైనింగ్) – అదనపు బాధ్యతలు
12. ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (2004 బ్యాచ్): డైరెక్టర్, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)
13. కార్తికేయ (2006 బ్యాచ్): ఐజీ (మల్టీ జోన్-1), ఐసీసీసీ డైరెక్టర్
14. కె. రమేష్ నాయుడు (2006 బ్యాచ్): రైల్వేస్ ఐజీ
15. డి. జోయల్ డేవిస్ (2010 బ్యాచ్): టీజీ-టీఎంఏఆర్ఎస్ రోడ్ సేఫ్టీ & ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా అదనపు బాధ్యతలుమ్యాప్లు చూడండి
16. జి. చందన దీప్తి (2012 బ్యాచ్): జోన్-7 (జోగుళాంబ/గద్వాల) డీఐజీగా అదనపు బాధ్యతలు
17. ఆర్. భాస్కరన్ (2012 బ్యాచ్): డీఐజీ (ఇంటెలిజెన్స్)
18. కె. నారాయణ నాయక్ (2009 బ్యాచ్): జోన్-2 (బాసర) డీఐజీగా అదనపు బాధ్యతలు
19. ఎల్.ఎస్. చౌహాన్ (2009 బ్యాచ్): డీఐజీ (కోఆర్డినేషన్), జోన్-6 డీఐజీగా అదనపు బాధ్యతలు
20. శ్రీబాలా దేవి: టీజీ-టీఎంఏఆర్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)
21. వి. అరవింద బాబు: హైదరాబాద్ సిటీ డీసీపీ (ఎస్ఎం & ఐటీ)మ్యాప్‌లు చూడండి
తాజా వార్తలు
- విశాఖలో CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు
- అబుదాబిలో హోటల్ వద్ద ఘర్షణ..8 మంది అరెస్ట్
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి, 30 మందికి గాయాలు
- దోహాలో రేపు ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మంది విశిష్ట వ్యక్తులకు సత్కారం
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!







