విశాఖలో CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు
- November 12, 2026
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు (CII International Partnership Summit) ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.
సదస్సు వేదికకు చేరుకునే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన శాలలను సందర్శించారు. ఆయా స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులు, కళాకృతులను ఆసక్తిగా తిలకించారు. వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు ఏర్పాటు చేసిన ప్రదర్శనల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో పారిశ్రామిక పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలు, రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపన, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు
- అబుదాబిలో హోటల్ వద్ద ఘర్షణ..8 మంది అరెస్ట్
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి, 30 మందికి గాయాలు
- దోహాలో రేపు ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మంది విశిష్ట వ్యక్తులకు సత్కారం
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!







