హైందవ' నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ 'ఎవరైనా' రిలీజ్
- November 12, 2026
‘కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్ లో ఉన్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఎవరైనా’ ను విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాలను కలిపి రూపొందించిన ఈ పాట వినగానే ఆకట్టుకుంటుంది. సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. మెలోడీ ట్యూన్, చక్కటి లిరిక్స్‌తో పాట మొదటిసారి విన్నప్పుడే కనెక్ట్ అయ్యేలా ఉంది.
కపిల్ కపిలన్, శ్వేతా మోహన్ తమ వాయిస్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం పాటకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. .
పాటలోని విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య కనిపించే మ్యాజిక్, వారి స్క్రీన్ ప్రెజెన్స్ పాటను మరింత ఆకట్టుకునేలా చేశాయి. ‘ఎవరైనా’ పాట ‘హైందవ’ ఆల్బమ్‌పై అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా, ఇప్పుడీ మెలోడీతో అంచనాలు పెంచింది.
ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ కన్నన్ డీవోపీగా పని చేస్తున్నారు, కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శివ కామేష్ డి ప్రొడక్షన్ డిజైనర్.
'హైందవ' నవంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త, మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను.
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి
నిర్మాత: మహేష్ చందు
బ్యానర్: మూన్‌షైన్ పిక్చర్స్
సమర్పణ: శివెన్ రామకృష్ణ
డీవోపీ: హరీష్ కన్నన్
సంగీతం: సామ్ సీఎస్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శివ కామేష్ డి
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
తాజా వార్తలు
- దోహాలో భారతీయ ప్రవాసులతో కేంద్ర మంత్రి ఆత్మీయ భేటీ..
- ఫుజైరా రోడ్డు ప్రమాదంలో కేరళ కుటుంబంలో విషాదం..కవలలతో పాటు మూడేళ్ల బాలుడు మృతి
- హైదరాబాద్‌లో మార్స్ సంస్థ భారీ విస్తరణ
- WhatsAppలో కొత్త సేఫ్టీ ఫీచర్..
- విశాఖలో CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు
- అబుదాబిలో హోటల్ వద్ద ఘర్షణ..8 మంది అరెస్ట్
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి, 30 మందికి గాయాలు
- దోహాలో రేపు ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మంది విశిష్ట వ్యక్తులకు సత్కారం
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు







