దోహాలో భారతీయ ప్రవాసులతో కేంద్ర మంత్రి ఆత్మీయ భేటీ..

- November 13, 2026 , by Maagulf
దోహాలో భారతీయ ప్రవాసులతో కేంద్ర మంత్రి ఆత్మీయ భేటీ..

భారత రాయబారులు శ్రీకర్ రెడ్డి, అరిందమ్ బాగ్చీతో కలిసి ప్రవాసులతో సమావేశం.. సమస్యలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి

దోహా: ఖతార్ రాజధాని దోహాలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులతో కేంద్ర మంత్రి ఆత్మీయంగా సమావేశమయ్యారు. భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి, రాయబారి అరిందమ్ బాగ్చీతో పాటు దోహాలోని భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఖతార్‌లోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ ప్రవాసులు, పలు భారతీయ సంఘాల ప్రతినిధులు, సంఘాల అధ్యక్షులతో కేంద్ర మంత్రి సమావేశమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భారతీయ సమాజ సంక్షేమం కోసం వివిధ సంఘాలు చేస్తున్న సేవలను అభినందించారు.

విదేశాల్లో ఉంటూ తమ ప్రతిభతో వివిధ రంగాల్లో విజయాలు సాధించడంతో పాటు, భారతీయ సమాజ అభివృద్ధికి, సంక్షేమానికి ప్రవాసులు అందిస్తున్న సేవలు దేశానికి గర్వకారణమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆందోళనలను మంత్రి ఆసక్తిగా ఆలకించారు. వారి సంక్షేమం, భద్రత, ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని హామీ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఖతార్‌లోని భారతీయ సమాజంతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశం ప్రవాసుల్లో సంతోషాన్ని నింపింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com