హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు..9 ఫాస్ట్‌ఫుడ్ ఔట్‌లెట్ల లైసెన్సులు రద్దు!
- November 13, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై తెలంగాణ స్టేట్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు ఉక్కుపాదం మోపారు. నగరంలో అపరిశుభ్రత, తీవ్ర స్థాయి నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఏడు కేఎఫ్‌సీ (KFC) మరియు రెండు డొమినోస్ పిజ్జా (Domino’s Pizza) ఔట్‌లెట్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన మొత్తం 13 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో ఈ రెండు సంస్థలకు చెందిన 26 ఔట్‌లెట్లలో తనిఖీలు చేపట్టడంతో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనిఖీల్లో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు: బొద్దింకలు, సింథటిక్ రసాయనాల వాడకం
ఈ ఆకస్మిక తనిఖీల్లో వంటగదులు మరియు స్టోరేజ్ ఏరియాల్లో పరిశుభ్రత లోపాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు అధికారులు తేల్చారు. వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు విపరీతంగా తిరుగుతుండటం, ఎలుకల వ్యర్థాలు కనిపించడం, గోడలపై ఫంగస్ పట్టడం, జిడ్డు పట్టిన వంట సామాగ్రి ఉండటం వంటి తీవ్ర ఉల్లంఘనలను గుర్తించారు. అంతేకాకుండా, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు తేలింది. అత్యంత ప్రమాదకరంగా.. వంట నూనెను మళ్లీ మళ్లీ వినియోగించేందుకు దాన్ని శుద్ధి చేయడానికి ‘సింథటిక్ మెగ్నీషియం సిలికేట్’ అనే రసాయనాన్ని అక్రమంగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించి, సుమారు 52 కిలోల ఈ రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ అనుమానంతో 20 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
లైసెన్సులు రద్దయిన ప్రముఖ ఔట్‌లెట్లు ఇవే.. ఆన్‌లైన్ డెలివరీల నుంచి తొలగింపు
అధికారులు లైసెన్సులు సస్పెండ్ చేసి, తక్షణమే మూసివేయాలని ఆదేశించిన వాటిలో మదీనగూడ-మియాపూర్, సింధి కాలనీ, చార్మినార్, మూసారాంబాగ్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ (శిల్పకళా వేదిక), మాదాపూర్ (ఇనార్బిట్ మాల్) లోని కేఎఫ్‌సీ శాఖలు ఉన్నాయి. అలాగే, కొండాపూర్ (శరత్ సిటీ మాల్), మాదాపూర్ (ఇనార్బిట్ మాల్) లోని డొమినోస్ ఔట్‌లెట్లు కూడా ఉన్నాయి. లైసెన్సులు పునరుద్ధరించే వరకు ఈ తొమ్మిది ఔట్‌లెట్ల వివరాలను స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి తొలగించాలని కూడా నిర్ణయించారు. వీటితో పాటు నిబంధనలు పాటించని మరో ఎనిమిది కేంద్రాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన మరో ఐదు ఔట్‌లెట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెంగళూరు మెట్రో పింక్ లైన్ ప్రారంభం
- దుబాయ్‌లో నవంబర్ 21, 22 తేదీల్లో నగరవ్యాప్త ధ్యాన కార్యక్రమం
- ఒమన్ రాయల్ హాస్పిటల్‌కు యూరోపియన్ గుర్తింపు..!!
- హౌతీల దాడులు, ప్రాంతీయ భద్రతపై సౌదీ–చైనా చర్చలు..!!
- ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- పెన్షన్ పొందే వయోపరిమితి పెంపునకు షురా కౌన్సిల్ బ్రేక్..!!
- యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!
- కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!
- భారత్‌లో 31వ CII భాగస్వామ్య సదస్సులో యూఏఈ ప్రతినిధి బృందం
- క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము సత్కారం..







