కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!
- November 13, 2026
కువైట్: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ రవాణా బస్సులు నడుపుతున్న వారిపై కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) హెచ్చరికలు, చర్యలు తీసుకోవడంతో పాఠశాల విద్యార్థులు, కార్యాలయ ఉద్యోగుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రైవేట్ బస్సులు, వ్యాన్ల ద్వారా రవాణా సేవలు పొందుతున్న పాఠశాలలు, కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లైసెన్స్‌లో అనుమతించిన కార్యకలాపాలకు భిన్నంగా బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించడంతో తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ రకమైన లైసెన్స్ ఉన్న సంస్థలు విద్యార్థులు, ప్రయాణికులకు రవాణా సేవలు అందించవచ్చనే విషయంలో స్పష్టత కోరుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పలు భారతీయ పాఠశాలలు తల్లిదండ్రులకు సర్క్యులర్లు జారీ చేసినట్లు సమాచారం. బస్సులు, డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో స్కూల్ బస్సులను నడపలేకపోతున్నామని పాఠశాలలు తెలిపాయి. దీంతో సొంత వాహనాలు లేని, ఉద్యోగాలకు వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా సదుపాయం లేని విద్యార్థుల కోసం కొన్ని పాఠశాలలు ఆన్లైన్ తరగతులను కూడా నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులతో పాటు పలువురు కార్యాలయ ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లైసెన్స్‌లో అనుమతించని కార్యకలాపాల కోసం బస్సులు నడుపుతున్న ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని MOI కీలక హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై జరిమానాలతో పాటు లైసెన్సుల రద్దు వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని రవాణా సంస్థలు తమకు కేటాయించిన లైసెన్స్ పరిధిని దాటి, ప్రయాణికులు, కార్మికులను డబ్బులు తీసుకుని తరలిస్తున్నట్లు గుర్తించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు, పాఠశాలలు, రవాణా నిర్వాహకులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- పెన్షన్ పొందే వయోపరిమితి పెంపునకు షురా కౌన్సిల్ బ్రేక్..!!
- యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!
- కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!
- భారత్‌లో 31వ CII భాగస్వామ్య సదస్సులో యూఏఈ ప్రతినిధి బృందం
- క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము సత్కారం..
- యూఏఈ నేషనల్ డే సెలవులు ప్రకటన..
- నగర ప్రజలకు, సిబ్బందికి కృతజ్ఞతలు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం
- గోల్డెన్ వీసా పేరుతో ఘరానా మోసం
- టీ20 లీగ్‌లకు ఐసీసీ కొత్త రూల్స్..
- పర్యాటకులకు గుడ్ న్యూస్.. షార్జాలో తిరిగి తెరుచుకున్న బీచ్‌లు..!!







