హౌతీల దాడులు, ప్రాంతీయ భద్రతపై సౌదీ–చైనా చర్చలు..!!

- November 13, 2026 , by Maagulf
హౌతీల దాడులు, ప్రాంతీయ భద్రతపై సౌదీ–చైనా చర్చలు..!!

రియాద్: సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు జరుపుతున్న దాడులు, ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛ తదితర అంశాలపై సౌదీ అరేబియా, చైనా ఉన్నతాధికారులు చర్చించారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో చైనా మధ్యప్రాచ్య వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి జాయ్ జున్ రియాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడంతో పాటు, సౌదీలోని పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరుపుతున్న దాడులపై చర్చించారు. 

ప్రాంతీయ పరిణామాలు, సంక్షోభాలను అదుపు చేయడం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపడుతున్న దౌత్య ప్రయత్నాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. ఇంధన భద్రతను బలోపేతం చేయడం, మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడటం, కీలక సముద్ర మార్గాల్లో నౌకాయానానికి భద్రత కల్పించడం అవసరమని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, బాబ్ అల్-మందెబ్ జలసంధుల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పరిరక్షించాలని పేర్కొన్నాయి. తద్వారా అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అభిప్రాయపడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com