ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- November 13, 2026
దోహా: దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉన్న నాసర్ మెడికల్ కాంప్లెక్స్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో పలువురు నిరాయుధ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు తెలిపింది. ఈ ఘటనను పాలస్తీనా ప్రజలపై జరిగిన ఘోరమైన నేరంగా, అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ మానవతా చట్టాల స్పష్టమైన ఉల్లంఘనగా అభివర్ణించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.
గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులను ఖతార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆసుపత్రులు, పౌరుల ఆస్తులు, ఇతర పౌర సదుపాయాలపై దాడులు చేయడాన్ని ఖండించింది. పౌరుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం తన బాధ్యతను నిర్వర్తించాలని ఖతార్ కోరింది. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని బాధ్యులుగా గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.
పాలస్తీనా సమస్యకు ఖతార్ తన సంపూర్ణ మద్దతును మరోసారి పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా, రెండు దేశాల పరిష్కార విధానం ద్వారా స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు కావాలని ఆకాంక్షించింది. 1967 సరిహద్దుల ఆధారంగా, తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాలని తన వైఖరిని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెంగళూరు మెట్రో పింక్ లైన్ ప్రారంభం
- దుబాయ్‌లో నవంబర్ 21, 22 తేదీల్లో నగరవ్యాప్త ధ్యాన కార్యక్రమం
- ఒమన్ రాయల్ హాస్పిటల్‌కు యూరోపియన్ గుర్తింపు..!!
- హౌతీల దాడులు, ప్రాంతీయ భద్రతపై సౌదీ–చైనా చర్చలు..!!
- ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- పెన్షన్ పొందే వయోపరిమితి పెంపునకు షురా కౌన్సిల్ బ్రేక్..!!
- యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!
- కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!
- భారత్‌లో 31వ CII భాగస్వామ్య సదస్సులో యూఏఈ ప్రతినిధి బృందం
- క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము సత్కారం..







