ఒమన్ రాయల్ హాస్పిటల్‌కు యూరోపియన్ గుర్తింపు..!!

- November 13, 2026 , by Maagulf
ఒమన్ రాయల్ హాస్పిటల్‌కు యూరోపియన్ గుర్తింపు..!!

మస్కట్: ఒమన్‌లోని రాయల్ హాస్పిటల్ నిర్వహించనున్న ఇంటర్నేషనల్ కాంగ్రెస్ 2026 (RHIC 2026)కు యూరోపియన్ గుర్తింపు లభించింది. వైద్య రంగంలో నైతిక ప్రమాణాలు, పారదర్శకత, అంతర్జాతీయ నియమ నిబంధనలకు అనుగుణంగా సదస్సును నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను గుర్తిస్తూ ఈ అక్రిడిటేషన్‌ను అందించారు. 

యూరోపియన్ మెడికల్ టెక్నాలజీ పరిశ్రమ సంఘానికి చెందిన ‘ఎథికల్ మెడ్‌టెక్’ (Ethical MedTech) ప్లాట్‌ఫామ్ ఈ గుర్తింపును జారీ చేసింది. పరిశ్రమకు సంబంధించిన నైతిక వ్యాపార విధివిధానాల కోడ్ ఆధారంగా నిర్వహించిన పరిశీలనలో RHIC 2026 విజయవంతంగా అర్హత సాధించింది. ఈ గుర్తింపు ఒమన్ వైద్య సంస్థలు అంతర్జాతీయ వృత్తిపరమైన, నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 

యూరోపియన్ మెడికల్ టెక్నాలజీ సంఘానికి అనుబంధంగా ఉన్న కంపెనీలు, సంస్థలు వైద్య సదస్సులకు మద్దతు ఇవ్వడం, వాటిలో పాల్గొనడం వంటి అంశాలను నిర్ణయించేందుకు ఈ అక్రిడిటేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణిస్తాయి. దీంతో వైద్య పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంతోపాటు, సంస్థాగత భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాల మార్పిడికి మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఈ గుర్తింపుతో అంతర్జాతీయ వైద్య కార్యక్రమాల నిర్వహణలో ఒమన్ స్థానం మరింత బలోపేతం కానుంది. విదేశీ వైద్య సంస్థలు, నిపుణులు, కంపెనీలను ఆకర్షించడంలో దేశానికి ప్రయోజనం చేకూరనుంది.

రాయల్ హాస్పిటల్ తన అంతర్జాతీయ వైద్య సదస్సును 2026 డిసెంబర్ 13 నుంచి 17 వరకు మస్కట్‌లోని ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వైద్య నిపుణులు, స్పెషలిస్టులు హాజరుకానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com