బహ్రెయిన్‌లో ప్రవాసుల చేపల విక్రయాలపై నిషేధం..!!
- November 16, 2026
మనామా: బహ్రెయిన్‌లో చేపల మార్కెట్లలో ప్రవాస కార్మికులు చేపల విక్రయాలు చేపట్టకుండా నిషేధం విధించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. చేపల వ్యాపారంలో బహ్రెయిన్ పౌరులకు ప్రాధాన్యం కల్పించడంతోపాటు, లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్ ఆర్థిక, న్యాయ వ్యవహారాల కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. స్థానికులకు అందుబాటులో ఉన్న చేపల విక్రయ కేంద్రాల సంఖ్య, ఈ వ్యాపారంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్న బహ్రెయిన్ పౌరుల సంఖ్య, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది.
చేపల విక్రయ వ్యాపారం ద్వారా బహ్రెయిన్ పౌరులు ఉపాధి పొందేలా మెరుగైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు కమిటీ ఛైర్మన్ అబ్దుల్ ఖాదర్ మహమూద్. మార్కెట్లలో ఎన్ని దుకాణాలు అందుబాటులో ఉన్నాయి? ఎంతమంది స్థానికులు ఈ వ్యాపారంలోకి రావాలనుకుంటున్నారు? వారికి ఎదురవుతున్న అడ్డంకులేమిటి? అనే అంశాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఎంపీలు ప్రతిపాదించిన ప్రధాన అంశాల్లో చేపల విక్రయ లైసెన్సుల జారీలో బహ్రెయిన్ పౌరులకు మొదటి ప్రాధాన్యం కల్పించడం ఒకటన్నారు. విదేశీ కార్మికుల వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోకుండా పరిమితులు విధించాలని కోరారు.
అలాగే రోడ్ల పక్కన చేపలు విక్రయించే వారు, అనుమతి లేని ప్రాంతాల్లో వ్యాపారం నిర్వహించే వారిపై తనిఖీలు కఠినతరం చేయాలని ప్రతిపాదించారు. వ్యాపార నిబంధనలు అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. చేపల వ్యాపారం చేయాలనుకునే బహ్రెయిన్ పౌరులకు మార్కెట్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను కేటాయించాలని ఎంపీలు కోరారు. మున్సిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలపై అభిప్రాయం కోరడంతో కమిటీ పరిశీలన ప్రారంభించిందని మహమూద్ వెల్లడించారు. షూరా కౌన్సిల్, పార్లమెంట్ వ్యవహారాల విభాగం ద్వారా ఈ అంశం మున్సిపల్ కౌన్సిల్‌కు చేరింది.
బహ్రెయిన్ సముద్రయాన చరిత్రలో చేపల వ్యాపారానికి ప్రత్యేక స్థానం ఉందని, ఈ రంగంపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని ఎంపీలు తమ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దేశంలోని మత్స్య పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయంలో స్థానికులకు ఎక్కువ వాటా దక్కేలా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల చేపల విక్రయాలపై నిషేధం..!!
- బహ్రెయిన్‌లో హౌసింగ్ ఫైనాన్సింగ్‌కు భారీ స్పందన..!!
- సౌదీ అరేబియాలో బోస్ స్పీకర్లు రీకాల్..!!
- కువైట్‌లో వాహన బీమా పాలసీలకు కొత్త నిబంధనలు..!!
- ఖతార్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్‌లో OMR100 మిలియన్ల బాండ్ల జారీ..!!
- యూఏఈలో ‘హోప్ మేకర్స్’కు విశేష స్పందన..!!
- రియాద్‌లో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్ 2026 వేడుకలు
- దోహాలో ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మందికి సేవా పురస్కారాలు
- విద్యార్థుల భద్రతకు కృషి చేస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్లు, సిబ్బందికి దుబాయ్ పోలీసుల సత్కారం







