కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ ఫొటోలు వాడుతున్నారా?

- November 17, 2026 , by Maagulf
కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ ఫొటోలు వాడుతున్నారా?

కువైట్: దేశ అమీర్, క్రౌన్ ప్రిన్స్ ఫోటోలను వాణిజ్య ప్రయోజనాల కోసం వస్తువులు, ఉత్పత్తులు, ప్రచురణల్లో ఉపయోగించడంపై కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అలాగే కువైట్ జాతీయ చిహ్నాన్ని కూడా వాణిజ్య అవసరాలకు వినియోగించకూడదని స్పష్టం చేసింది.

ఈ నిషేధం 2014లో జారీ చేసిన మంత్రిత్వ శాఖ తీర్మానం నంబర్ 216 ప్రకారం అమల్లో ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు అమీర్, క్రౌన్ ప్రిన్స్ ఫోటోలను లేదా దేశ జాతీయ ఫోటోను ట్రేడ్‌మార్క్‌లుగా ఉపయోగించడం, వాటితో కూడిన వస్తువులను విక్రయించడం, ప్రచారం చేయడం నిషేధం. అంతేకాకుండా వాటిని అవమానకరంగా ఉపయోగించడం కూడా చట్టవిరుద్ధమని పేర్కొంది.

నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు మంత్రిత్వ శాఖ తన తనిఖీ బృందాల ద్వారా దేశంలోని అన్ని గవర్నరేట్ల పరిధిలో మార్కెట్లలో క్షేత్రస్థాయి తనిఖీలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com