ఖతార్ అమీర్‌తో అబుదాబి డిప్యూటీ రూలర్ భేటీ..!!

- November 17, 2026 , by Maagulf
ఖతార్ అమీర్‌తో అబుదాబి డిప్యూటీ రూలర్ భేటీ..!!

దోహా: ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో యూఏఈ అబుదాబి డిప్యూటీ పాలకుడు, జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నూన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ అయ్యారు. దోహాలోని అమీరి దివాన్‌లో ఈ సమావేశం జరిగింది. షేక్ తహ్నూన్‌తో పాటు ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం కూడా ఈ భేటీలో పాల్గొంది.

ఈ సమావేశంలో ఖతార్, యూఏఈ మధ్య చిరకాలంగా కొనసాగుతున్న సోదరభావ సంబంధాలు, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, అమీరి దివాన్ అధిపతి అబ్దుల్లా బిన్ మహమ్మద్ అల్ ఖులైఫీతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com