సౌదీలో సపోర్ట్ లేబర్ రంగంపై నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..!!

- November 17, 2026 , by Maagulf
సౌదీలో సపోర్ట్ లేబర్ రంగంపై నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..!!

రియాద్: సౌదీ అరేబియాలో సపోర్ట్ లేబర్ (సహాయక కార్మికుల) రంగానికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ రంగంలో ఉల్లంఘనలు, వాటికి విధించే జరిమానాల పట్టికలో మార్పులు చేస్తూ మంత్రి ఉత్తర్వు నంబర్ 112377 జారీ చేసిన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేసింది.

కార్మికుల హక్కుల పరిరక్షణ, సేవల నాణ్యత పెంపు, నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడం, ఒప్పందంలో భాగస్వాములైన అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడటం లక్ష్యంగా కొత్త సవరణలు తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త ఉల్లంఘనలు, జరిమానాల పట్టికలో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు, వర్తించే చట్టపరమైన నిబంధనలు, తీసుకునే చర్యలను పొందుపరిచినట్లు తెలిపింది. 

నిబంధనల అమలును నిర్ధారించేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలతో పాటు ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను కూడా కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సంబంధిత సంస్థలు, వ్యక్తులు ఉల్లంఘనలు, జరిమానాల పట్టికతో పాటు సపోర్ట్ లేబర్ రంగానికి సంబంధించిన నిబంధనలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి వాటిని పాటించాలని సూచించింది. ఎక్కడైనా ఉల్లంఘనలు గుర్తిస్తే అధికారిక మార్గాల ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com