ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ దళాలు

- November 17, 2026 , by Maagulf
ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ దళాలు

పలు దాడులను లక్ష్యాలను చేరకముందే ధ్వంసం చేసినట్లు ప్రకటన

మనామా: ఇరాన్ నుంచి వచ్చిన పలు వైమానిక దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేసినట్లు బహ్రెయిన్ రక్షణ దళాలు వెల్లడించాయి. నవంబర్ 17, మంగళవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపాయి.

ఈ మేరకు బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నుంచి జరిగిన వైమానిక దాడులను లక్ష్యాలను చేరకముందే తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని పేర్కొంది.

దేశ భద్రత దృష్ట్యా సైనిక విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని, రాజ్యాన్ని రక్షించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని జనరల్ కమాండ్ స్పష్టం చేసింది.

ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్ రక్షణ దళాలు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని ఈ ప్రకటన వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com