కువైట్ ప్రవాసుల్లో భారతీయులే టాప్..!!
- November 17, 2026
కువైట్ : కువైట్‌లో కార్మికుల సంఖ్య ఏడాది కాలంలో 58,248 పెరిగింది. దీంతో 2026 జూన్ చివరి నాటికి దేశంలోని మొత్తం కార్మికుల సంఖ్య 30 లక్షలు దాటి 3,044,773కు చేరింది. 2025 జూన్‌లో ఈ సంఖ్య 2,986,525గా ఉంది. అంటే ఏడాది కాలంలో 2 శాతం వృద్ధి నమోదైంది. కువైట్ సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో (CSB) తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం ఉద్యోగుల్లో ప్రైవేటు రంగం వాటా 58.5 శాతంగా ఉంది. గృహ కార్మికుల రంగం 25.7 శాతం, ప్రభుత్వ రంగం 15.8 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
కువైట్ల ఉద్యోగుల సంఖ్య తగ్గుదల
నివేదిక ప్రకారం కువైట్ పౌరులైన ఉద్యోగుల సంఖ్య 3.9 శాతం తగ్గి 431,385కు చేరింది. మరోవైపు గృహ కార్మికులను మినహాయించి చూస్తే ప్రవాస ఉద్యోగుల సంఖ్య 2.9 శాతం పెరిగి సుమారు 1.83 మిలియన్లకు చేరుకుంది. కువైట్‌లో విదేశీ కార్మికుల్లో భారతీయులు మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. గృహ కార్మికుల రంగాన్ని మినహాయిస్తే 573,285 మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. గృహ కార్మికులను కూడా కలిపితే ఈ సంఖ్య 878,688కు చేరింది.
కువైట్ ఉద్యోగుల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారి శాతం కూడా పెరిగింది. యూనివర్సిటీ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు ఉన్న కువైట్ ఉద్యోగుల వాటా 2025లో 55 శాతంగా ఉండగా, 2026లో 56.4 శాతానికి పెరిగింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి కువైట్ పౌరుల సగటు నెలవారీ వేతనం KD 1,603గా ఉంది. ప్రవాస ఉద్యోగుల సగటు నెలవారీ వేతనం KD 356గా నమోదైంది. మొత్తంగా కువైట్ కార్మిక మార్కెట్‌లో భారతీయుల ప్రాధాన్యం మరోసారి ఈ గణాంకాలతో స్పష్టమైంది.
తాజా వార్తలు
- ఆసియాన్-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం: ప్రధాని మోదీ
- యూఏఈ ఇన్నోవేట్స్ 2026 అవార్డులు ప్రదానం..దుబాయ్ పోలీసులకు అత్యున్నత పురస్కారం
- ఖతార్‌లో కొత్తగా 331 ప్రొఫెషనల్ లైసెన్సులు..!!
- తొలి 9 నెలల్లో 50.4 మిలియన్ మంది ప్రయాణికులకు సేవలందించిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- కువైట్ ప్రవాసుల్లో భారతీయులే టాప్..!!
- బహ్రెయిన్ లో ఉగ్రవాద కేసులో జీవిత ఖైదు.. పలువురికి 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- హోర్మజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ పై దాడి
- ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ దళాలు
- వందేభారత్‌లో చిక్కుకున్న 12 మంది..సెండాఫ్ ఇవ్వడానికి వెళ్తే రూ.36 వేల జరిమానా!
- బహ్రెయిన్‌లో భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజ..!!







