ఖతార్‌లో కొత్తగా 331 ప్రొఫెషనల్ లైసెన్సులు..!!
- November 17, 2026
దోహా: విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయులు, పాఠశాలల లీడర్స్ వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఖతార్ విద్య, ఉన్నత విద్యాశాఖ (MoEHE) 331 కొత్త ప్రొఫెషనల్ లైసెన్సులకు ఆమోదం తెలిపింది. విద్యాశాఖలోని ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌కు చెందిన ప్రొఫెషనల్ లైసెన్సింగ్ విభాగం ఈ లైసెన్సులను మంజూరు చేసింది. వీటిలో పాఠశాలల నాయకులకు 14, ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్లకు 317 లైసెన్సులు ఉన్నాయి.
లైసెన్సుల మంజూరు ప్రక్రియలో నాణ్యతను పెంచేందుకు విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆమోదించిన ప్రమాణాల ప్రకారం మూల్యాంకనం చేయడం, ఫలితాలను సమీక్షించడం, క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించడం ద్వారా పారదర్శకత, నిష్పక్షపాత విధానాన్ని నిర్ధారిస్తోంది. 331 కొత్త లైసెన్సుల ఆమోదం విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాలల నాయకుల వృత్తిపరమైన నైపుణ్యాలను బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు అని విద్యాశాఖ పేర్కొంది.
ప్రొఫెషనల్ లైసెన్స్ అనేది కేవలం విద్యా సిబ్బందికి ఇచ్చే ఒక ధ్రువపత్రం మాత్రమే కాదని, సంబంధిత వ్యక్తి నిర్దేశించిన వృత్తిపరమైన నైపుణ్యాలు, పనితీరు ప్రమాణాలను అందుకున్నట్లు తెలిపే గుర్తింపు అని స్పష్టం చేసింది. లైసెన్సుల సంఖ్య ఆధారంగానే ఈ విధానం విజయాన్ని అంచనా వేయలేమని విభాగం పేర్కొంది. ఎవాల్యూషన్ ప్రక్రియ నాణ్యత, ప్రమాణాల నిష్పక్షపాత అమలు, ఫలితాల విశ్వసనీయతతో పాటు బోధన, పాఠశాలల నిర్వహణ విధానాల్లో వస్తున్న మెరుగుదల కూడా కీలకమని వివరించింది.
తాజా వార్తలు
- ఆసియాన్-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం: ప్రధాని మోదీ
- యూఏఈ ఇన్నోవేట్స్ 2026 అవార్డులు ప్రదానం..దుబాయ్ పోలీసులకు అత్యున్నత పురస్కారం
- ఖతార్‌లో కొత్తగా 331 ప్రొఫెషనల్ లైసెన్సులు..!!
- తొలి 9 నెలల్లో 50.4 మిలియన్ మంది ప్రయాణికులకు సేవలందించిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- కువైట్ ప్రవాసుల్లో భారతీయులే టాప్..!!
- బహ్రెయిన్ లో ఉగ్రవాద కేసులో జీవిత ఖైదు.. పలువురికి 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- హోర్మజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ పై దాడి
- ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ దళాలు
- వందేభారత్‌లో చిక్కుకున్న 12 మంది..సెండాఫ్ ఇవ్వడానికి వెళ్తే రూ.36 వేల జరిమానా!
- బహ్రెయిన్‌లో భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజ..!!







