ఖతార్‌లో పిల్లలను కారులో వదిలేస్తే QR10,000 జరిమానా..!!
- November 20, 2026
దోహా: ఖతార్‌లో కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం పిల్లలు, పెద్దల పర్యవేక్షణ అవసరమైన వ్యక్తులను కారులో ఒంటరిగా వదిలివెళ్లడం నిషేధమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ వాహనంలో వారిని ఒంటరిగా వదిలివెళ్లకూడదని స్పష్టం చేసింది.
కొత్త ట్రాఫిక్ చట్టం నంబర్ 19 ఆఫ్ 2026లోని ఆర్టికల్ 71, పేరా 2 ప్రకారం 13 ఏళ్లలోపు పిల్లలను పెద్దల పర్యవేక్షణ లేకుండా వాహనంలో ఉంచకూడదు. ఈ నిబంధన పిల్లలకే పరిమితం కాదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టపరమైన నిర్ణయాధికారం లేని వ్యక్తులు, దివ్యాంగులు, వైద్యపరమైన కారణాలతో ఇతరుల పర్యవేక్షణ అవసరమైన వారికీ ఇది వర్తిస్తుందని తెలిపింది.
అలాగే వాహనంలో సురక్షితంగా ఉండేందుకు పెద్దల సహాయం అవసరమయ్యే అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులను కూడా ఒంటరిగా వదిలివెళ్లడం నిషేధమని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి QR10,000 జరిమానా విధిస్తామని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు, ఇతర బలహీన కేటగిరీ వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!
- మలేషియా వెళ్లే భారతీయులకు అలర్ట్.. 2027 నుంచి కొత్త రూల్స్
- ఖతార్‌లో పిల్లలను కారులో వదిలేస్తే QR10,000 జరిమానా..!!
- పాకిస్థాన్లో ఘోర విషాదం..రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి!
- సౌదీ సరిహద్దుల్లో ‘అబ్షర్ ట్రావెల్’ సేవలకు ఎలక్ట్రిక్ బైక్లు..!!
- సౌదీ అరేబియాలో 2027 నుంచి కొత్త టాక్స్ విధానం..!!
- కువైట్లో ఆహార భద్రత తనిఖీలు..!!
- యూఏఈలో ఫైర్ వర్క్స్, డ్రోన్ షోలు, సైనిక పరేడ్లతో సందడి..!!
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..







