మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!

- November 20, 2026 , by Maagulf
మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!

మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్‌లోని సుల్తాన్ ఖాబూస్ స్ట్రీట్ నుంచి అల్ ఖువైర్ స్ట్రీట్‌కు వెళ్లే ఎగ్జిట్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది. నవంబర్ 19 గురువారం రాత్రి నుంచి నవంబర్ 22 ఆదివారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

బౌషర్ విలాయత్ పరిధిలో కొనసాగుతున్న అల్ ఖువైర్ రూట్ అభివృద్ధి పనుల్లో భాగంగా రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 19 నుంచి 22 వరకు ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు సంబంధిత ఎగ్జిట్‌ను మూసివేస్తారు. ఉదయం వేళల్లో ట్రాఫిక్ యథావిధిగా కొనసాగుతుంది.

ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ సూచికలు, అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని మున్సిపాలిటీ సూచించింది. ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ రాకపోకలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com