బహ్రెయిన్‌లో భారీ సైబర్ మోసం..మహిళ అరెస్ట్..!!
- November 22, 2026
మనామా: బహ్రెయిన్‌లో రెండు వేర్వేరు సైబర్ మోసం కేసులకు సంబంధించి ఆఫ్రికా దేశానికి చెందిన ఓ మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో BD649,997.767 నగదును స్వాధీనం చేసుకుని బాధిత కంపెనీకి తిరిగి అప్పగించారు.
బహ్రెయిన్ సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ విభాగం అధిపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితురాలు తన బ్యాంకు ఖాతాలను ఉపయోగించి మోసం ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించి, ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ బ్యాంకు గుర్తించిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మోసం ద్వారా వచ్చిన నగదు నిందితురాలి ఖాతాలో జమ అయినట్లు గుర్తించిన అధికారులు, ఆమె ఇతర బ్యాంకు ఖాతాలకు కూడా నగదును బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేసి, నేరానికి సంబంధించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ-మెయిల్ హ్యాక్ చేసి కంపెనీకి మోసం
మరో కేసులో ఓ కంపెనీ ఈ-మెయిల్ సమాచార వ్యవస్థను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అనంతరం వ్యాపార లావాదేవీని పూర్తి చేయాలనే నెపంతో కంపెనీ ప్రతినిధులను నమ్మించి డబ్బు బదిలీ చేయించారు. ఈ క్రమంలో BD649,997.767 మొత్తాన్ని నిందితురాలి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయితే అధికారులు సకాలంలో స్పందించడంతో ఆ నగదును వినియోగించకముందే స్వాధీనం చేసుకుని తిరిగి కంపెనీకి అప్పగించారు.
ఈ కేసుల్లో భాగంగా ప్రాసిక్యూషన్ అధికారులు సాక్షులను విచారించడంతోపాటు బ్యాంకు లావాదేవీలు, సంబంధిత పత్రాలను పరిశీలించారు. నిందితురాలిని కూడా విచారించి, దర్యాప్తు పూర్తయ్యే వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. సైబర్ మోసాల ద్వారా కోల్పోయిన నగదును తిరిగి బాధితులకు అందించడం, వారి హక్కులను కాపాడటం తమ ప్రాధాన్యత అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. నగదును గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో సహకరించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బ్యాంకింగ్ సంస్థలను ప్రశంసించింది.
తాజా వార్తలు
- కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!!
- వచ్చే వారం ఖతార్‌లో పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- సౌదీలో 25.2 శాతం పెరిగిన డెలివరీ ఆర్డర్లు..!!
- బహ్రెయిన్‌లో భారీ సైబర్ మోసం..మహిళ అరెస్ట్..!!
- ఒమన్‌లో సాంస్కృతిక వారసత్వ సంపదకు చట్టపరమైన రక్షణ..!!
- దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!!
- రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ పోలీసుల ఆధ్వర్యంలో బహ్రెయిన్‌కు చెందిన దివ్యాంగ పోలీసు అధికారికి ఘన స్వాగతం
- ఒమన్‌లో ఘనంగా 56వ జాతీయ దినోత్సవ వేడుకలు.. డ్రోన్ షోలతో ఆకట్టుకున్న ఆకాశం
- షేక్ జాయెద్ ఫెస్టివల్‌కు ఉచిత బస్సు సర్వీసులు..







