సౌదీలో 25.2 శాతం పెరిగిన డెలివరీ ఆర్డర్లు..!!
- November 22, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఆన్లైన్ డెలివరీ సేవలకు ఆదరణ పెరుగుతోంది. 2026 మూడో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా డెలివరీ ఆర్డర్లు 129 మిలియన్లకు మించాయి. 2025 ఇదే కాలంతో పోలిస్తే 25.2 శాతం వృద్ధి నమోదైంది.
సౌదీ రవాణా జనరల్ అథారిటీ (TGA) విడుదల చేసిన త్రైమాసిక గణాంకాల బులెటిన్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. డెలివరీ యాప్‌ల వినియోగం పెరగడం, ప్రజలు ఆన్లైన్ డెలివరీ సేవలపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రాంతాల వారీగా డెలివరీ ఆర్డర్ల వాటా ఇలా..
* రియాద్ – 44 శాతం
* మక్కా ప్రాంతం – 22 శాతం
* తూర్పు ప్రావిన్స్ – 16 శాతం
* మదీనా – 5 శాతం
* అసీర్ – 4 శాతం
* ఖాసిమ్ – 3 శాతం
* తబూక్ – 2 శాతం
* హాయిల్ – 2 శాతం
* అల్ జౌఫ్ – 1 శాతం
* నార్తర్న్ బోర్డర్స్ – 1 శాతం
* జజాన్ – 1 శాతం
* నజ్రాన్ – 1 శాతం
* అల్ బహా – 0.28 శాతం
మొత్తం డెలివరీ ఆర్డర్లలో రియాద్ ఒక్కటే 44 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. మక్కా ప్రాంతం 22 శాతం, తూర్పు ప్రావిన్స్ 16 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశంలో డెలివరీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, సేవల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్లు TGA వెల్లడించింది. ఈ చర్యల ద్వారా డెలివరీ రంగంలో వృద్ధి, స్థిరత్వంతోపాటు సేవలపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!!
- వచ్చే వారం ఖతార్‌లో పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- సౌదీలో 25.2 శాతం పెరిగిన డెలివరీ ఆర్డర్లు..!!
- బహ్రెయిన్‌లో భారీ సైబర్ మోసం..మహిళ అరెస్ట్..!!
- ఒమన్‌లో సాంస్కృతిక వారసత్వ సంపదకు చట్టపరమైన రక్షణ..!!
- దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!!
- రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ పోలీసుల ఆధ్వర్యంలో బహ్రెయిన్‌కు చెందిన దివ్యాంగ పోలీసు అధికారికి ఘన స్వాగతం
- ఒమన్‌లో ఘనంగా 56వ జాతీయ దినోత్సవ వేడుకలు.. డ్రోన్ షోలతో ఆకట్టుకున్న ఆకాశం
- షేక్ జాయెద్ ఫెస్టివల్‌కు ఉచిత బస్సు సర్వీసులు..







