కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!!

- November 22, 2026 , by Maagulf
కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!!

కువైట్: కువైట్, అమెరికా మధ్య ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరిగాయి. కువైట్ ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల శాఖ సహాయ మంత్రి, తాత్కాలిక వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అబ్దులజీజ్ అల్-మర్జూక్ వాషింగ్టన్‌లో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కువైట్‌లో చేపట్టే అభివృద్ధి, పెట్టుబడి ప్రాజెక్టుల్లో అమెరికా ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంచే అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రాధాన్యత కలిగిన ఆర్థిక రంగాల్లో అమెరికా కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలించారు.

అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలోనూ అల్-మర్జూక్ పాల్గొన్నారు. పలువురు అమెరికా కంపెనీలు, సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కువైట్ ఆర్థిక ప్రణాళికలు, వ్యాపార అనుకూల వాతావరణం మెరుగుదల, పెట్టుబడులకు సంబంధించిన చట్టాలు, విధానాల ఆధునికీకరణ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల బలోపేతంపై సమావేశంలో సమీక్షించారు.

అమెరికా వ్యాపార వర్గాలతో సహకారాన్ని విస్తరించేందుకు కువైట్ ఆసక్తిగా ఉందని అల్-మర్జూక్ తెలిపారు. అమెరికా కంపెనీల నైపుణ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు నాణ్యమైన పెట్టుబడులను ఆకర్షించవచ్చని పేర్కొన్నారు. దీర్ఘకాలిక, సుస్థిర అభివృద్ధికి ఈ సహకారం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com