వచ్చే వారం ఖతార్‌లో పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక..!!

- November 22, 2026 , by Maagulf
వచ్చే వారం ఖతార్‌లో పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక..!!

దోహా: ఖతార్‌లో వచ్చే వారం పొగమంచు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఖతార్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. 

దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవచ్చని, హారిజాంటల్ విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పొగమంచు ఉన్న సమయంలో వాహన వేగాన్ని తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com