కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- November 22, 2026
కువైట్ : కువైట్‌లోని ఉమ్మ్ ఖదీర్ ప్రకృతి సంరక్షణ కేంద్రంలోకి (Umm Qadeer Nature Reserve) అక్రమంగా ప్రవేశించిన 10 మందిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఉపయోగించిన 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 6 పక్షులను కూడా అధికారులు పట్టుకున్నారు. ప్రకృతి వనరులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ విభాగం సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాయి. నిషేధం ఉన్నప్పటికీ నిందితులు వాహనాలతో రిజర్వులోకి ప్రవేశించి అక్కడి సహజ పర్యావరణానికి నష్టం కలిగించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో అక్కడి వన్యప్రాణుల ఆవాసాలకు కూడా ఇబ్బంది కలిగిందని తెలిపింది.
ప్రకృతి సంరక్షణ కేంద్రాల్లోకి ప్రవేశించడం, వేటాడటం, అనుమతి లేకుండా సంచరించడం నిషేధమని అధికారులు గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఈ ఉల్లంఘన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్యల్లో స్వాధీనం చేసుకున్న 6 వాహనాలను సీజ్ చేశారు. పట్టుకున్న 6 పక్షులను తిరిగి స్వేచ్ఛగా వదిలిపెట్టారు. అరెస్టయిన 10 మందిని సెంట్రల్ జైలుకు తరలించి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
ప్రకృతి సంరక్షణ ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు, నిఘా కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రిజర్వుల్లోకి అక్రమంగా ప్రవేశించినా, సహజ పర్యావరణానికి హాని కలిగించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!
- GTA 6 గేమ్‌పై యూఏఈ హెచ్చరిక..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రైళ్ల కొత్త డిజైన్‌ను పరిశీలించిన షేక్ హమ్దాన్..
- తిరుమల శ్రీవారికి పారిశ్రామికవేత్త భారీ కానుక..
- ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు
- షేక్ జాయెద్ రోడ్డు పై పరుగుల సందడి.. ఘనంగా దుబాయ్ రన్ 2026 ప్రారంభం







