తిరుమల శ్రీవారికి పారిశ్రామికవేత్త భారీ కానుక..
- November 22, 2026
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ పారిశ్రామికవేత్త భారీ బంగారు కానుక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. కొన్నేళ్ల క్రితం మొక్కుకున్న మొక్కును నెరవేర్చుకునేందుకు ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేయించిన 45 ఆభరణాలను స్వామివారికి సమర్పించనున్నారు. వీటి విలువ సుమారు రూ.160 కోట్లు ఉంటుందని అంచనా. వీటిని తొమ్మిది సెట్లుగా తయారు చేశారు. ఈ ఆభరణాల తయారీకి ఏకంగా 15 నెలల సమయం పట్టినట్లు పేర్కొంటున్నారు. నైపుణ్యం కలిగిన కళాకారులు ఎంతో శ్రమించి వీటిని రూపొందించారు.
స్వామివారి భక్తుడైన పారిశ్రామికవేత్త ఓ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అందులో కొంత వాటా విక్రయం ద్వారా పెద్ద మొత్తంలో సొమ్ము వచ్చింది. అదంతా స్వామివారి అనుగ్రహమేననే భావనతో భారీ కానుక ఇచ్చేందుకు గత ఏడాది ముందుకొచ్చాడు. గతంలో మొక్కుకున్న మొక్కును నెరవేర్చుకునే ప్రక్రియలో భాగంగా నవంబర్ 26వ తేదీన ఆ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు ఈ బంగారు ఆభరణాలను అధికారికంగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టీటీడీ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీవారు నిత్యం సుమారు 120 కిలోల మేర ఆభరణాలు ధరిస్తారు. ఈ నేపథ్యంలో 121 కిలో బంగారు నగలను భక్తుడు సమర్పించనున్నాడు. ఒక వ్యక్తిగత భక్తుడు శ్రీవారికి సమర్పిస్తున్న అతిపెద్ద బంగారు కానుకగా దీనిని పేర్కొంటున్నారు. భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ భారీ కానుక ఇప్పుడు భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారికి పారిశ్రామికవేత్త భారీ కానుక..
- ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు
- షేక్ జాయెద్ రోడ్డు పై పరుగుల సందడి.. ఘనంగా దుబాయ్ రన్ 2026 ప్రారంభం
- మెక్సికోలో కార్టెల్ హింస..11 మంది మృతి
- కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!!
- వచ్చే వారం ఖతార్‌లో పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- సౌదీలో 25.2 శాతం పెరిగిన డెలివరీ ఆర్డర్లు..!!
- బహ్రెయిన్‌లో భారీ సైబర్ మోసం..మహిళ అరెస్ట్..!!
- ఒమన్‌లో సాంస్కృతిక వారసత్వ సంపదకు చట్టపరమైన రక్షణ..!!
- దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!!







