ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- November 22, 2026
దోహా: ఖతార్‌లో అనారోగ్య సెలవు (సిక్‌లీవ్) సర్టిఫికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఎలక్ట్రానిక్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు పేపర్ కాపీలు, చేతితో చేసిన సంతకాలు, ఆసుపత్రుల స్టాంపులు అవసరం లేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంత్రి నిర్ణయం నంబర్ 54 ఆఫ్ 2026 ప్రకారం ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఖతార్‌లో e-Jaza వ్యవస్థ ద్వారానే సిక్‌లీవ్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. ఇతర ఎలక్ట్రానిక్ వ్యవస్థలు లేదా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లకు అధికారిక గుర్తింపు ఉండదు.
కొత్త విధానం ప్రకారం రోగులకు రెండు సురక్షిత లింకులతో కూడిన ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్ అందుతుంది. వీటిలో ఒక సర్టిఫికెట్లో వైద్య నిర్ధారణ వివరాలు ఉంటాయి. మరో సర్టిఫికెట్లో ఆ వివరాలు ఉండవు. రోగులు తమ అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు సర్టిఫికెట్లను డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
e-Jaza ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లపై QR కోడ్ లేదా బార్కోడ్ ఉంటుంది. వీటికి చేతితో సంతకం చేయడం లేదా ఆసుపత్రి స్టాంపు వేయడం అవసరం లేదు. దీంతో సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. అయితే సిక్‌లీవ్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం ఖతార్‌లో లైసెన్స్ పొందిన వైద్యులు, దంత వైద్యులకు మాత్రమే ఉంటుంది. వారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తమకు కేటాయించిన వ్యక్తిగత ఖాతాల ద్వారానే సర్టిఫికెట్లు జారీ చేయాలి. అలాగే రోగి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందా? అంటువ్యాధికి సంబంధించినదా? వంటి తప్పనిసరి వైద్య వివరాలను కూడా సర్టిఫికెట్లో నమోదు చేయాలి.
నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ వైద్యులు, ఆసుపత్రులపై ఎప్పటికప్పుడు తనిఖీలు, ఆడిట్లు నిర్వహించనుంది. సిక్‌లీవ్‌కు సంబంధించిన అర్హతలు, సర్టిఫికెట్ల జారీ విధానం, వ్యవస్థ దుర్వినియోగం వంటి అంశాలను పరిశీలించనుంది. నిబంధనలను ఉల్లంఘించినా, ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసినా సంబంధిత చట్టాల ప్రకారం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!
- GTA 6 గేమ్‌పై యూఏఈ హెచ్చరిక..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రైళ్ల కొత్త డిజైన్‌ను పరిశీలించిన షేక్ హమ్దాన్..
- తిరుమల శ్రీవారికి పారిశ్రామికవేత్త భారీ కానుక..
- ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు
- షేక్ జాయెద్ రోడ్డు పై పరుగుల సందడి.. ఘనంగా దుబాయ్ రన్ 2026 ప్రారంభం







