రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!

- November 22, 2026 , by Maagulf
రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!

మస్కట్: సముద్ర ప్రయాణంలో ఉన్న ఓ వాణిజ్య నౌకలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన రష్యా పౌరుడిని ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAFO) అత్యవసరంగా ఆసుపత్రికి తరలించింది.

ధోఫర్ గవర్నరేట్ పరిధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలో రష్యా పౌరుడికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వెంటనే వైద్య తరలింపు చర్యలు చేపట్టింది.

విమాన సహాయంతో బాధితుడిని సలాలాలోని సుల్తాన్ ఖాబూస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించి బాధితుడికి వైద్య సహాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com