దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!

- November 24, 2026 , by Maagulf
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!

దుబాయ్: దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరుగుతున్న బిగ్ 5 గ్లోబల్ 2026 ప్రదర్శన సందర్భంగా కొన్ని పార్కింగ్ ప్రాంతాల్లో గంటకు Dh25 చొప్పున ఛార్జీ వసూలు చేయనున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ట్రేడ్ సెంటర్ పరిధిలోని 335X, 336X, 337X పార్కింగ్ జోన్లలో ఈ ప్రత్యేక ఛార్జీలు అమలులో ఉంటాయని తెలిపింది. నవంబర్ 26 వరకు నాలుగు రోజుల పాటు ఈ ధరలు కొనసాగనున్నాయి.

ప్రత్యేక కార్యక్రమాలు, ప్రదర్శనలు జరిగే ప్రాంతాల్లో పార్కింగ్ రద్దీని నియంత్రించేందుకు దుబాయ్‌లో వేరియబుల్ పార్కింగ్ ఫీజుల విధానాన్ని 2025 ప్రారంభంలో ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలను బట్టి పార్కింగ్ ఛార్జీలు మారుతుంటాయి. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పరిసరాల్లోని పార్కింగ్ ప్రాంతాలను పార్కిన్ సంస్థ 'గ్రాండ్ ఈవెంట్ జోన్'గా పేర్కొంటోంది.

ఏమిటీ బిగ్ 5 గ్లోబల్?

మిడిలిస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లో అతిపెద్ద నిర్మాణ రంగ ప్రదర్శనగా బిగ్ 5 గ్లోబల్ గుర్తింపు పొందింది. నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగ సంస్థలు, నిపుణులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ట్రేడ్ సెంటర్ పరిసరాలకు వచ్చే వాహనదారులు పార్కింగ్ ఛార్జీలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com