బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- November 24, 2026
మనామా: పనిచేస్తున్న సంస్థకు చెందిన BD188,000కు పైగా నగదును దుర్వినియోగం చేసిన కేసులో ఓ ఆసియా దేశానికి చెందిన రెస్టారెంట్ మేనేజర్‌కు బహ్రెయిన్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దొంగిలించిన BD188,471 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. థర్డ్ లోయర్ క్రిమినల్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్ డ్రా, విదేశాలకు నగదు బదిలీలు, కంపెనీ బ్యాంకు కార్డులతో వ్యక్తిగత కొనుగోళ్లు చేస్తూ మేనేజర్ ఈ మొత్తాన్ని స్వాహా చేసినట్లు విచారణలో వెల్లడైంది.
నాలుగు నెలల వ్యవధిలో కంపెనీ ఖాతాల్లో తేడాలు రావడంతో రెస్టారెంట్ యజమాని తనిఖీ చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు లావాదేవీలు, నగదు విక్రయాలపై నిర్వహించిన అకౌంటింగ్ నివేదికలో మేనేజర్ అక్రమాలు బయటపడ్డాయి. అంతేకాకుండా వ్యాట్ (VAT) చెల్లించకపోవడంతో విధించిన జరిమానాలు, పోటీ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల జరిగిన నష్టాలు, ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం వంటి ఇతర ఆర్థిక సమస్యలు కూడా కంపెనీకి ఎదురైనట్లు విచారణలో గుర్తించారు.
2025 జూలై 17 నుంచి నవంబర్ 18 మధ్య కాలంలో కంపెనీ మేనేజర్‌గా, క్యాషియర్ గా తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసి సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు నమోదు చేసింది. బహ్రెయిన్ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 424 ప్రకారం, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అప్పగించిన నగదును దొంగిలించిన వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అలాగే దుర్వినియోగం చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ఆధారంగా కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు BD188,471 తిరిగి చెల్లించాలని, శిక్ష పూర్తయిన తర్వాత శాశ్వతంగా బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







