శ్రుతి హాసన్‌తో శాంతి టాకీస్ కొత్త సినిమా ప్రకటన
- November 24, 2026
విభిన్నమైన కథలు, క్వాలిటీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాణ సంస్థ శాంతి టాకీస్ తమ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించింది. అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’తో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ తేజ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు.
శివకార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మావీరన్’, సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘3బీహెచ్‌కే’ వంటి సినిమాలతో శాంతి టాకీస్ విభిన్నమైన కథలను, కొత్త తరహా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఇదే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి హాసన్, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్నారు. నటనతో పాటు సింగర్‌గా, మ్యూజీషియన్‌గా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రతి సినిమాలో తనదైన ప్రత్యేకతను చూపించే శ్రుతి హాసన్, శాంతి టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ కొత్త తమిళ సినిమాలో లీడ్ రోల్‌లో కనిపించనున్నారు.
గతంలో వసంత్ రవి హీరోగా నటించిన ‘అశ్విన్స్’ సినిమాకు తరుణ్ తేజ దర్శకత్వం వహించారు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా విభిన్నమైన కథనం, ఆకట్టుకునే విజువల్స్, అద్భుతమైన సౌండ్ డిజైన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ కొత్త సినిమాతో తరుణ్ తేజ మరో ఆసక్తికరమైన కథను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. తనదైన దర్శకత్వ శైలికి శ్రుతి హాసన్ నటన తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
నిర్మాత అరుణ్ విశ్వ, దర్శకుడు తరుణ్ తేజ, శ్రుతి హాసన్ కలయికలో రాబోతున్న ఈ సినిమా మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌గా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్‌తో శాంతి టాకీస్ మరో కొత్త జానర్‌ను టచ్ చేస్తూ, విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్, కథాంశం, షూటింగ్ షెడ్యూల్ వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు
- డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..
- గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు







