రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు
- November 24, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఆర్థిక జిల్లాలో ఉన్న ఓ టవర్ పై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన ఉగ్రదాడిలో 11 మంది గాయపడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటనను సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం ధృవీకరించింది.
గాయపడిన వారిలో ఇద్దరు సౌదీ పౌరులు, ఇద్దరు భారతీయులు, ముగ్గురు నేపాల్‌కు చెందినవారు, నలుగురు ఈజిప్టు దేశస్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దాడి జరిగిన వెంటనే సంబంధిత భద్రతా, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని పౌర రక్షణ విభాగం తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అవసరమైన అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
అంతకుముందు యెమెన్‌లో చట్టబద్ధత పునరుద్ధరణ కోసం పనిచేస్తున్న సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికి రియాద్ ఆర్థిక జిల్లాలోని ఓ టవర్ లక్ష్యంగా దాడి జరిగినట్లు వెల్లడించారు. ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనలో భారతీయులు కూడా గాయపడటంతో సౌదీ అరేబియాలోని భారతీయ ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది.
తాజా వార్తలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు
- డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..
- గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు
- ఫేస్బుక్, స్నాప్‌చాట్, పబ్జీతో సహా 87 యాప్‌లను నిషేధించిన భారత సైన్యం
- సౌదీలో జీసీసీ వాహనాల గడువు ముగింపు..!!







