రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- November 25, 2026
అబుదాబి: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై హౌతీ గ్రూప్ జరిపిన దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో పలువురు గాయపడటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటన విడుదల చేసింది. రియాద్‌పై జరిగిన దాడి సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ఆ దేశ భద్రత, స్థిరత్వానికి ముప్పుగా పరిణమించిందని పేర్కొంది.
ఈ క్లిష్ట సమయంలో సౌదీ అరేబియాకు యూఏఈ పూర్తి సంఘీభావం ప్రకటించింది. సౌదీ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు ఆ దేశం తీసుకునే అన్ని చర్యలకు తమ మద్దతు ఉంటుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు
- డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..
- గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు
- ఫేస్బుక్, స్నాప్‌చాట్, పబ్జీతో సహా 87 యాప్‌లను నిషేధించిన భారత సైన్యం







