ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- November 25, 2026
దోహా: ఖతార్‌లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆహార వైవిధ్యాన్ని ప్రతిబింబించే ‘పాసేజ్ టు ఇండియా 2026’ భారతీయ కమ్యూనిటీ ఫెస్టివల్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్ 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
భారతీయ సాంస్కృతిక కేంద్రం (ICC), దోహాలోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. నవంబర్ 19న నిర్వహించిన మీడియా సమావేశానికి ఖతార్‌లో భారత రాయబారి డా. కె. శ్రీకర్ రెడ్డి అధ్యక్షత వహించి ఉత్సవాల వివరాలను వెల్లడించారు.
ఖతార్‌లోని ఐడియల్ ఇండియన్ స్కూల్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుల సంగీత విభావరి, రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ సాంస్కృతిక పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రత్యేక పెవిలియన్లు, షాపింగ్ స్టాళ్లు, దేశంలోని విభిన్న ప్రాంతాల సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ఒకే వేదికపై ఆస్వాదించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, గొప్ప సాంస్కృతిక వారసత్వం, భారత్-ఖతార్ మధ్య కొనసాగుతున్న స్నేహ సంబంధాలను చాటిచెప్పడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
ఈ రెండు రోజుల వేడుకల్లో ఖతార్‌లో నివసిస్తున్న భారతీయులతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొని భారతీయ సంస్కృతి వైభవాన్ని ఆస్వాదించాలని భారత రాయబార కార్యాలయం ఆహ్వానించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు
- డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..
- గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు
- ఫేస్బుక్, స్నాప్‌చాట్, పబ్జీతో సహా 87 యాప్‌లను నిషేధించిన భారత సైన్యం







