ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!
- November 25, 2026
దోహా: బరువు తగ్గించే పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ‘హూడియా గోర్డోని (Hoodia Gordonii)’ ఉత్పత్తిలో ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) గుర్తించింది. సాధారణంగా ‘కాక్టస్ పిల్స్ (Cactus Pills)’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ఉత్పత్తిలో ఆరోగ్యానికి హాని కలిగించే సిబుట్రామైన్ (Sibutramine) ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారణ అయింది.
ఖతార్‌లో ఈ ఉత్పత్తికి అధికారిక రిజిస్ట్రేషన్ లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఔషధాల నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల అనంతరం దీనిని నకిలీ ఉత్పత్తిగా వర్గీకరించింది. దీనిని ఉపయోగించడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ ఉత్పత్తిని ప్రచారం చేస్తున్నవారు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నియంత్రణ చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!
- కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!
- బహ్రెయిన్ పార్లమెంట్లో ఆహార భద్రతపై చర్చ..!!
- ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!
- దుబాయ్‌లో తగ్గుతున్న రెంట్స్..ఇళ్లు మారుతున్న టెనేంట్స్..!!
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు







