కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!

- November 25, 2026 , by Maagulf
కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!
కువైట్: కువైట్‌లోని కబ్ద్ (Kabd) ఎడారి ప్రాంతంలో గొర్రెల దొంగతనం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ గొర్రెల షెడ్డులోకి చొరబడి సుమారు KD 15,000 విలువైన 70 గొర్రెలను అపహరించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. గొర్రెల యజమాని షెడ్‌ వద్దకు చేరుకోగా, ఒక ప్రవేశ ద్వారం వద్ద బలవంతంగా తెరిచిన ఆనవాళ్లు కనిపించాయి. లోపల పరిశీలించగా, అధిక విలువ కలిగిన జాతికి చెందిన 70 గొర్రెలు కనిపించలేదు.
 
దీంతో బాధితుడు కబ్ద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దొంగల వివరాలు తనకు తెలియవని, అపహరణకు గురైన గొర్రెల సంఖ్య, వాటి జాతి, విలువకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించాడు. సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు. వేలిముద్రలను కూడా పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేపట్టింది
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com