భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!

- November 25, 2026 , by Maagulf
భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!

రియాద్: సౌదీ అరేబియా, ఒమన్ దేశాల భద్రతా విభాగాల సమన్వయంతో భారీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నం విఫలమైంది. మొత్తం 500,000 మాదకద్రవ్యాల మాత్రలను తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఒమన్ అధికారులు అడ్డుకున్నట్టు. సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ తలాల్ బిన్ షల్హౌబ్ వెల్లడించారు. 

సౌదీ మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం (General Directorate of Narcotics Control) అందించిన పక్కా సమాచారంతో ఒమన్‌లోని సంబంధిత అధికారులకు ఈ అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకోవడం సాధ్యమైందని తెలిపింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న నేర ముఠాల కదలికలపై ముందస్తు నిఘా పెట్టడం ద్వారా ఈ చర్య చేపట్టినట్లు ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల రవాణాను గుర్తించడం, వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఒమన్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగుతోందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న నేర ముఠాలను ఎదుర్కోవడంలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి భద్రతా సహకారం, సమన్వయం ఈ ఘటనతో మరోసారి వెల్లడైందన్నారు. మాదకద్రవ్యాల ద్వారా దేశ భద్రతకు, యువత భవిష్యత్తుకు ముప్పు కలిగించే నేర కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని సౌదీ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలను మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు చర్యలు మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com