కువైట్‌లో గొర్రెల పెంపకందారులకు డిసెంబర్ 31 వరకు గడువు..!!
- November 25, 2026
కువైట్ : కువైట్‌లో అనుమతులు లేకుండా గొర్రెల పెంపకం నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెంపకందారులు తమ ఉల్లంఘనలను సరిదిద్దుకోవడానికి, ఆక్రమణలను తొలగించుకోవడానికి 2026 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. ఈ విషయాన్ని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అనుమతులు లేని ప్రాంతాల్లో గొర్రెల పెంపకం నిర్వహిస్తున్నవారు తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవాలని, ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్ యూసుఫ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎడారి ప్రాంతాలు, ప్రకృతి సంరక్షణ కేంద్రాల్లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలపై ఈ సమావేశంలో సమీక్షించారు. తనిఖీల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కేటాయించిన భూముల దుర్వినియోగం, నిషేధిత వస్తువుల నిల్వతో పాటు నేరాలకు సంబంధించి వెతుకుతున్న వ్యక్తుల వాహనాలు, వదిలివేసిన వాహనాలు కొన్ని ప్రాంతాల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అనుమతులు పొందిన గొర్రెల పెంపకందారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే కార్యకలాపాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన స్థావరాలు, ప్రభుత్వ భూములపై ఆక్రమణలను తొలగించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి సంరక్షణ ప్రాంతాలను కాపాడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్‌లో గొర్రెల పెంపకందారులకు డిసెంబర్ 31 వరకు గడువు..!!
- ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!
- బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!
- యూఏఈలో వరుస రోడ్డు ప్రమాదాలు.. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్..!!
- ఫ్లిప్ కార్ట్ సీఈవో రాజీనామా
- సౌదీ పర్యాటక శాఖ నుంచి 5 డిజిటల్ సేవలు..!!
- తిరుమల యాత్రికుల భద్రతకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం
- మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటో
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!







