‘భోగి’ కోసం ప్రాణం పెట్టి పనిచేశా: హీరో శర్వా

- November 25, 2026 , by Maagulf
‘భోగి’ కోసం ప్రాణం పెట్టి పనిచేశా: హీరో శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా పూర్తిగా రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 27న ‘భోగి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. 

మ్యూజికల్ ఈవెంట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను నేను పర్సనల్‌గా చాలా ఎంజాయ్ చేశాను. కార్తీక పౌర్ణమి రోజు ఈ ‘గంగా’ పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రెండు పాటలు రిలీజ్ అయిన తర్వాత మ్యూజికల్ ఈవెంట్ పెట్టమని డైరెక్టర్ గారిని నేనే అడిగాను. చంద్రబోస్ గారు అద్భుతమైన సాహిత్యం రాశారు. ఆయన పాటలు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్స్ చంద్రబోస్ గారు. భీమ్స్ ప్రాణం పెట్టి ఈ సినిమాకు పనిచేశారు. చాలా కొత్త టాలెంట్‌ను, సింగర్స్‌ను పరిచయం చేస్తున్నారు. తన ఫస్ట్ సినిమా నాదైనందుకు హ్యాపీగా ఉంది. ‘భోగి’తో మళ్లీ చరిత్రలో నిలిచిపోయే పాటలు ఇచ్చినందుకు ఆయనకు థాంక్యూ. సంపత్ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నేను కూడా ఈ సినిమాకు ఒక డెబ్యూ యాక్టర్‌లాగే ఫీల్ అయ్యాను. నేను ఈ క్యారెక్టర్ చేయగలనని సంపత్ నంది గారు బలంగా నమ్మారు. ఈ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన సంపత్ కి థాంక్యూ. మా ప్రొడ్యూసర్ రాధామోహన్ కి కృతజ్ఞతలు. డింపుల్‌లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అనుపమ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఇందులో తనకు, నాకు మధ్య ఉండే లవ్ స్టోరీని కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా రాశారు. నేను ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పుడూ చూడలేదు. అది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అలాగే సినిమాలో నా చెల్లెలుగా నటించిన అందరికీ థాంక్యూ. ఆల్ ది బెస్ట్. నవంబర్ 27న వస్తున్నాం. నా కెరీర్‌లో 37 సినిమాలకు ఎంత కష్టపడ్డానో, ఈ ఒక్క సినిమాకు అంత కష్టపడ్డాను. బ్లడ్ పెట్టి ఈ సినిమాకు పనిచేశాను. కచ్చితంగా మీకు ఒక కొత్త సినిమా, డిఫరెంట్ సినిమా చూసిన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మీరు సినిమా చూసి బయటికి వచ్చి ‘ఇదిరా సినిమా’ అని అనుకునేలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. “ఈ మ్యూజికల్ ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో మొదట రిలీజ్ చేసిన ‘ఎగిలివారంగా’ పాట ప్రతి ఇంటికీ వెళ్లింది. పల్లె బతికున్నంత వరకు ఆ పాట బతుకుతుంది. అలాగే తర్వాత వచ్చిన ‘అన్నయ్య ప్రాణంలో’ పాట కూడా అద్భుతమైన ఆదరణ అందుకుంది. అన్నాచెల్లెళ్ల రిలేషన్‌ను అద్భుతంగా ఆవిష్కరించింది. ఇందులో మరో పాట ఉంది. అది ఈ రెండు పాటలకు మించి ఉండబోతోంది. ఈ సినిమా పాటలకు ఇంత మంచి ఆదరణ దక్కడానికి మొదటి కారణం చంద్రబోస్ .కథను అర్థం చేసుకుని శ్రోతల గుండెను తాకేలా రాయడం చంద్రబోస్ గారి ప్రత్యేకత. ఆయన చరిత్రలో నిలిచిపోయే పాటలు రాశారు. అలాగే భీమ్స్ ఎనర్జీ లేకపోతే ఈరోజు ఆ పాటలు ఇంత అద్భుతంగా వచ్చేవి కావు. ఇంత మంచి పాటలు ఇచ్చిన భీమ్స్‌కు కూడా థాంక్యూ. అలాగే ఇందులో పాటలు పాడిన సింగర్స్ అందరికీ థాంక్యూ. ఇందులో పాటలన్నీ మట్టి వాసన గుబాళించేలా ఉన్నాయి. నేను మరోసారి ఒకటే మాట చెబుతున్నాను. ఇప్పటివరకు శర్వానంద్ లో బెస్ట్ చూశారు. ఈ సినిమాలో ఆయన బీస్ట్ చూస్తారు. ఈరోజు ఆయన నుంచి వచ్చే ప్రతి పెర్ఫార్మెన్స్ ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌లా ఉండబోతోంది. నవంబర్ 27న ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి విశ్వరూపం చూస్తారు. తప్పకుండా ఈ కంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది.”

నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చంద్రబోస్, మా డీఓపీ, డైరెక్టర్ కిరణ్, మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్.. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా నటీనటులకు, తెర వెనుక పని చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.”

హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోసం చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పనిచేశారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయ్యి ఈ జోనర్‌లో వస్తున్న సినిమా ఇది. అలాగే ఇందులో అద్భుతమైన తెలంగాణ జానపద గీతాలు ఉన్నాయి. నవంబర్ 27న తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడండి. శర్వా గారికి, అనుపమకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇంత పవర్‌ఫుల్ లిరిక్స్ ఇచ్చిన చంద్రబోస్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన పాటలు రాయడం నాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను మొదటిసారి గుర్తించి, సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన హీరో మా శర్వానంద్. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాం. అందరికీ ధన్యవాదాలు. రికార్డింగ్ అయిపోయింది. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. అందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు రండి. తప్పకుండా చాలా గొప్ప అనుభూతిని ఈ సినిమా అందిస్తుంది.”

లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమాలో రాసిన ప్రతి మాట కూడా కథ నుంచి పుట్టింది. కథ కోసం పుట్టింది. అలాంటి సందర్భాలు ఇచ్చిన దర్శకుడు సంపత్ నందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కచ్చితంగా అందరి కష్టం ఫలిస్తుంది. అదృష్టం వరిస్తుందని నమ్మకం ఉంది.” ఈ వేడుక సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com