ఒలింపిక్ గోల్డ్ మెడల్ పోయిందని బాధపడుతున్న ఆమెరికా అథ్లెట్!
- August 30, 2016
ఒలింపిక్ గోల్డ్ మెడల్ పోయిందని బాధపడుతున్న ఆమెరికా అథ్లెట్ చెంతకు పతకం చేరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ లో రోయింగ్ విభాగంలో జో జాకోబి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే మాజీ ఒలింపియన్ జో జాకోబి గత జూన్ లో తన పతకం పోయిందని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తన కారులో నుంచి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని పతకాన్ని ఎవరో చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అందరికీ ఆ విషయం తెలిసిపోయింది. ఇది జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత తండ్రితో కలిసి వెళ్తుండగా ఏడేళ్ల అట్లాంటా చిన్నారి కోల్ స్మిత్ ఓ చెత్తకుండీలో స్వర్ణ పతకాన్ని గుర్తించింది.
ఈ పతకం జకోబి పతకం అని తండ్రీకూతుళ్లు నిర్ధారించుకున్నారు. అతడికి పతకాన్ని అందేలా చేశారు. చిన్నారి కోల్ స్మిత్ గురించి తెలుసుకుని ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆమెను అభినందించాడు. దీంతో ఆ స్కూలు యాజమాన్యంతో పాటు చిన్నారి స్నేహితులకు ఆమె చేసిన గొప్పపని గురించి తెలిసింది. చిన్నారి కోల్ స్మిత్ కూడా స్వర్ణ పతకాన్ని చేతిలోకి తీసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా మళ్లీ తన వద్దకు చేరిన మెడల్ ను స్కూలు విద్యార్థులకు చూపించాడు. గొప్ప అథ్లెట్ తమ స్కూలుకు రావడంతో యాజయాన్యంతో పాటు విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







