దోహా ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ ట్యాక్స్
- August 30, 2016
ఖతార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక నుంచి ప్యాసింజర్ ట్యాక్స్‌ని ప్రయాణీకులకు విదించనున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి ఎయిర్పోర్ట్ వర్గాలు. ఈ వారంలో 35 రియాల్స్ (10 డాలర్లు) లెవీగా అమల్లోకి తీసుకొస్తామని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (హెచ్ఐఎ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎయిర్‌లైన్ టిక్కెట్ ధరలతోపాటు ఈ పన్ను మొత్తాన్ని వసూలు చేస్తారు. ఆగస్ట్ 30 నుంచి జారీ అయ్యే టిక్కెట్లు అలాగే, డిసెంబర్ 1 తర్వాత ప్రయాణించేవారిపై ఈ పన్నును విదించనున్నారు. దోహా ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఏడాది తొలి క్వార్టర్లో 9 మిలియన్ ప్యాసింజర్లు ప్రయాణం సాగించారు. 2022 ఫుట్ బాల్ వరల్డ్ కప్‌ని నిర్వహించనున్న ఖతార్, తొలిసారిగా 15 ఏళ్ళ తర్వాత బడ్జెట్ డెఫిసిట్‌లో పడింది. సుమారు 12 బిలియన్ డాలర్ల డెఫిసిట్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. 2017, 2018లో కూడా బడ్జెట్ డెఫిసిట్ తప్పకపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







