డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’..
- November 27, 2026
హైదరాబాద్: దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు ప్రజాప్రతినిధుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాదయాత్రలో అడుగులు వేస్తూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ సంఘీభావాన్ని తెలిపారు.
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకుప్రముఖ హీరోలు నాగార్జున,సాయి కుమార్, ప్రజాప్రతినిధులు, యువత, సామాజిక సంస్థలు, ప్రజలు సమష్టిగా ముందుకు రావాలని ఈ కార్యక్రమం పిలుపునిస్తోంది.
తాజా వార్తలు
- డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’..
- హైదరాబాద్లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ ప్రారంభం..సుస్థిర రవాణాకు కార్పొరేట్ల ప్రతిజ్ఞ
- త్వరలో 25 వేల ఉద్యోగాలు..సీఎం రేవంత్ కీలక ప్రకటన
- సొంతూరి అభివృద్ధికి చిత్తర్వు కుటుంబీకుల సంకల్పం
- దుబాయ్లో బరువు తగ్గించే ఉత్పత్తిపై నిషేధం..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో గాయపడ్డ ఇద్దరు ఇటలీ పౌరులు మృతి..!!
- ఖతార్లో టీమిండియా ‘ఎ’ జట్టుకు ఘన సత్కారం..అభినందించిన భారత రాయబారి
- ఈజిప్టు అధ్యక్షుడు అల్సీసీతో ఖతార్ అమీర్ చర్చలు..!!
- తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం..భారీ విరాళం పై సీఎం చంద్రబాబు స్పందన
- ద్వైపాక్షిక ఆర్థిక సహకారంపై ఒమన్–జపాన్ చర్చలు..!!







