ఇరాన్ డ్రోన్ దాడిలో గాయపడ్డ ఇద్దరు ఇటలీ పౌరులు మృతి..!!
- November 27, 2026
కువైట్: కువైట్‌లోని కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇరాన్ డ్రోన్ దాడిలో గాయపడిన ఇద్దరు ఇటలీ పౌరులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్టాఫ్ కల్నల్ సౌద్ అల్ అత్వాన్ ఈ మరణాలను ధ్రువీకరించారు.
ఇరాన్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఇటలీ పౌరులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఘటనలో ఇంకా గాయాలతో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
అంతకుముందు కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లు దేశంలోని ఓ కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో డ్రోన్ల నుంచి పడిన శకలాల కారణంగా నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒక కువైట్ పౌరుడు, ఇద్దరు ఇటలీ పౌరులు, ఒక పాకిస్థానీ ఉన్నారు.
తాజా వార్తలు
- సొంతూరి అభివృద్ధికి చిత్తర్వు కుటుంబీకుల సంకల్పం
- దుబాయ్‌లో బరువు తగ్గించే ఉత్పత్తిపై నిషేధం..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో గాయపడ్డ ఇద్దరు ఇటలీ పౌరులు మృతి..!!
- ఖతార్‌లో టీమిండియా ‘ఎ’ జట్టుకు ఘన సత్కారం..అభినందించిన భారత రాయబారి
- ఈజిప్టు అధ్యక్షుడు అల్సీసీతో ఖతార్ అమీర్ చర్చలు..!!
- తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం..భారీ విరాళం పై సీఎం చంద్రబాబు స్పందన
- ద్వైపాక్షిక ఆర్థిక సహకారంపై ఒమన్–జపాన్ చర్చలు..!!
- సౌదీలో 77 శాతం మంది ప్రజలకు చేరువలోనే పార్కులు..!!
- బహ్రెయిన్‌లో ఈ-బైక్‌లతో పిల్లలకు ప్రమాదం..!!
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026 ప్రారంభం.. ప్రపంచ స్థాయి యాట్స్ ఆవిష్కరణలతో సందడి







