సొంతూరి అభివృద్ధికి చిత్తర్వు కుటుంబీకుల సంకల్పం

- November 27, 2026 , by Maagulf
సొంతూరి అభివృద్ధికి చిత్తర్వు కుటుంబీకుల సంకల్పం

అమరావతి: స్వగ్రామమైన మామిడికోళ్ల గ్రామ సమగ్ర అభివృద్ధే తమ చిత్తర్వు కుటుంబీకుల ప్రధాన లక్ష్యమని సీనియర్ న్యాయవాది చిత్తర్వు నాగేశ్వరరావు అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

మామిడికోళ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం ఆయన స్వగ్రామానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయవాదులు, ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో చిత్తర్వు వేణుగోపాలరావు, చిత్తర్వు రఘు, డాక్టర్ చిత్తర్వు వెంకటేష్, బెండి శ్రీనివాస్, చావా నాగేశ్వరరావు, బండ్రెడ్డి బద్రీనాథ్,తోట నాగేశ్వరరావు(గిరీశం), చావా కిషోర్, కొల్లూరి నిరీక్షణరావు, తోట ఈశ్వరరావు, రాయవరపు ప్రభుదాసు, సోమ్సొన్, మాచవరపు గోపి తదితరులు పాల్గొన్నారు.

స్వగ్రామంతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో చిత్తర్వు కుటుంబీకులు భాగస్వాములయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com