ఖతార్‌లో టీమిండియా ‘ఎ’ జట్టుకు ఘన సత్కారం..అభినందించిన భారత రాయబారి
- November 27, 2026
దోహా: ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాల్గొనేందుకు ఖతార్‌కు వచ్చిన భారత ‘ఎ’ క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. నవంబర్ 24, 2026న ఖతార్‌లోని ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ (IOC) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కమ్యూనిటీ రిసెప్షన్ కార్యక్రమంలో భారత రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐఎస్సీ అధ్యక్షుడితో కలిసి భారత ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, వైస్ కెప్టెన్ రింకూ సింగ్, ప్రధాన కోచ్ హృషీకేశ్ కనిట్కర్తో పాటు జట్టు సభ్యులు, అధికారులను రాయబారి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జట్టు సభ్యులకు అభినందనలు తెలిపిన రాయబారి, టోర్నీలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఖతార్‌లోని భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత క్రికెట్ జట్టుకు తమ మద్దతు ప్రకటించారు. భారత క్రికెట్ పట్ల ప్రవాస భారతీయుల్లో ఉన్న అభిమానం, ఐక్యత ఈ కార్యక్రమంలో ప్రతిబింబించాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్‌లో టీమిండియా ‘ఎ’ జట్టుకు ఘన సత్కారం..అభినందించిన భారత రాయబారి
- ఈజిప్టు అధ్యక్షుడు అల్సీసీతో ఖతార్ అమీర్ చర్చలు..!!
- తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం..భారీ విరాళం పై సీఎం చంద్రబాబు స్పందన
- ద్వైపాక్షిక ఆర్థిక సహకారంపై ఒమన్–జపాన్ చర్చలు..!!
- సౌదీలో 77 శాతం మంది ప్రజలకు చేరువలోనే పార్కులు..!!
- బహ్రెయిన్‌లో ఈ-బైక్‌లతో పిల్లలకు ప్రమాదం..!!
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026 ప్రారంభం.. ప్రపంచ స్థాయి యాట్స్ ఆవిష్కరణలతో సందడి
- హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. గల్లంతైన సిబ్బంది మృతి: ADNOC ప్రకటన
- ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న కువైట్.. నలుగురికి గాయాలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!







