కువైట్‌లో మాదకద్రవ్యాల కేసులో రాజకుటుంబ సభ్యుడి అరెస్ట్..
- November 28, 2026
కువైట్: మాదకద్రవ్యాల కేసులో కువైట్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తితో పాటు మరో వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు, నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, రాజకుటుంబ సభ్యులైనా చట్టాన్ని సమానంగా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ సెక్యూరిటీ విభాగం పరిధిలో పనిచేస్తున్న జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు ఈ అరెస్టులు చేపట్టారు.
ఈ తనిఖీల్లో నిందితుల నుంచి 1.2 కిలోల హషీష్, 262 లిరికా క్యాప్సూల్స్, 100 జానాక్స్ మాత్రలు, 200 ట్రామల్ మాత్రలు, అనుమానిత మత్తు పదార్థాలకు చెందిన 38 మాత్రలు, నాలుగు డిజిటల్ వెయింగ్ స్కేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ఇద్దరు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం సంబంధిత నార్కోటిక్స్ ప్రాసిక్యూషన్ అధికారులకు అప్పగించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
చట్టాన్ని అమలు చేయడంలో ఎలాంటి వివక్షకు తావులేదని, రాజకుటుంబ సభ్యులైనా, సామాన్య పౌరులైనా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కువైట్ ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని వెల్లడించింది.
తాజా వార్తలు
- కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..
- కువైట్‌లో మాదకద్రవ్యాల కేసులో రాజకుటుంబ సభ్యుడి అరెస్ట్..
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్
- బహ్రెయిన్‌లో సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం విస్తరణ..!!
- కువైట్‌లో మాదకద్రవ్యాలతో రూలింగ్ ఫ్యామిలీ మెంబర్ అరెస్ట్..!!
- ఖతార్–కెనడా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ..!!
- సౌదీపై దాడులను ఖండించిన పలు దేశాలు..!!
- యూఏఈ జాతీయ దినోత్సవం.. వాహనదారులకు శుభవార్త..!!
- విమానంలో సాంకేతిక లోపం.. మస్కట్‌కు మళ్లింపు..!!
- ఒమన్‌లో ‘గల్ఫ్ ఆట’ ఆవిర్భావం..ప్రవాస భారతీయుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం







