కువైట్‌లో మాదకద్రవ్యాలతో రూలింగ్ ఫ్యామిలీ మెంబర్ అరెస్ట్..!!

- November 28, 2026 , by Maagulf
కువైట్‌లో మాదకద్రవ్యాలతో రూలింగ్ ఫ్యామిలీ మెంబర్ అరెస్ట్..!!

కువైట్: మాదకద్రవ్యాలు, మత్తు కలిగించే ఔషధ మాత్రలు కలిగి ఉన్న ఇద్దరిని కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒకరు దేశ రూలింగ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

జనరల్ డిపార్ట్‌మెంట్ ఫర్ డ్రగ్ కంట్రోల్ (GDDC) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిందితుల నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు, నిషేధిత ఔషధ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 1.2 కిలోల హషీష్, 262 లిరికా పిల్స్, 100 జానాక్స్ పిల్స్, 200 ట్రామల్ పిల్స్, అనుమానాస్పదంగా ఉన్న మరో 38 పిల్స్ ఉన్నాయి.

నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని, స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు వారిని తదుపరి విచారణ కోసం డ్రగ్స్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టం ముందు అందరూ సమానమేనని, పాలక కుటుంబ సభ్యులైనా ఎలాంటి మినహాయింపులు లేకుండా చట్టాన్ని సమానంగా అమలు చేస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com