బహ్రెయిన్‌లో సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం విస్తరణ..!!

- November 28, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం విస్తరణ..!!

మనామా: బహ్రెయిన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా నార్త్ సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం సామర్థ్యాన్ని రోజుకు 30,000 క్యూబిక్ మీటర్లకు పెంచారు. BD15.5 మిలియన్ల వ్యయంతో చేపట్టిన ఈ విస్తరణ ప్రాజెక్టును బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా నవంబర్ 26న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సిత్రా, ఈస్ట్ సిత్రా, నబీహ్ సలేహ్ దీవులతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 13,000 ఆస్తులకు మురుగునీటి శుద్ధి సేవలు అందనున్నాయి. 

పెరుగుతున్న జనాభా, నివాస సముదాయాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని విస్తరించారు. పట్టణ, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి వ్యవస్థలు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, నీటి భద్రతకు కీలకమని తెలిపారు. 

నార్త్ సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని 1985లో రోజుకు 7,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. 2009లో చేపట్టిన తొలి విస్తరణతో సామర్థ్యం 16,500 క్యూబిక్ మీటర్లకు పెరిగింది. తాజాగా చేపట్టిన రెండో భారీ విస్తరణతో రోజువారీ సామర్థ్యం 30,000 క్యూబిక్ మీటర్లకు చేరింది. ఈ పెంపుతో ఈస్ట్ సిత్రా సిటీలో అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాలతో పాటు నార్త్ సిత్రా పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు వీలవుతుంది.

బ్లూ వాటర్ బయో సంస్థ ఈ విస్తరణ పనులను సుమారు BD15.5 మిలియన్ల వ్యయంతో చేపట్టింది. ఇందులో HYBACS సాంకేతికతను ఉపయోగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com