లేబర్ సిటీ సీవేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి
- August 31, 2016
అష్గల్, కొత్త పంపింగ్ స్టేషన్, ట్రీటెడ్ సీవేజ్ ఎఫ్లుయెంట్ (టిఎస్‌ఇ) ప్లాంట్ పనుల్ని మెసైమీర్‌లోని లేబర్ సిటీలో పూర్తి చేసింది. ఈ పనులతో మొత్తం 75,000 మంది కార్మికులకు ఉపయోగకరంగా ఉండనుంది. వీరందరికీ రానున్న రోజుల్లో అకామడేషన్ కోసం ఏర్పాట్లు చేసినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. పంపింగ్ స్టేషన్ నిర్మాణం, రిహాబిలిటేషన్ ప్రాజెక్టులు, 27 పంప్ స్టేషన్ల నిర్మాణం అలాగే అభివృద్ధి, 18 రైజింగ్ మెయిన్స్‌ని దోహా, అల్ వక్రా, అల్ రయ్యాన్, సాలియా వంటి ప్రాంతాల్లో విస్తరించడం ఐదున్నరేళ్ళలోపు పూర్తవుతుంది. లేబర్ సిటీ కొత్త నిర్మాణాల కోసం మొత్తంగా 61.8 మిలియన్ ఖతారీ రియాల్స్ ఖర్చవుతోంది. మల్టీ ఫేస్ పంప్ స్టేషన్‌నిర్మాణం మరియు అప్‌గ్రేడేషన్ కోసం 1.1 మిలియన్ ఖతారీ రియాల్స్ ఖర్చవుతుంది. సెకెనుకు 417 లీటర్ల కెపాసిటీతో లేబర్ సిటీలోని ఇండస్ట్రియల్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌ని పూర్తి చేశారు. 3 కిలోమీటర్ల మేర టిఎస్‌ఇ లైన్‌ని నిర్మించి, దాని ద్వారా లేబర్ సిటీ లాండ్ స్కేప్ కోసం పాగునీటిని సరఫరా చేస్తారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







