త్వరలో ప్రారంభంకానున్న నితిన్,త్రివిక్రమ్ ల చిత్రం
- August 02, 2015
విలువలే ఆస్తి అంటూ సన్నాఫ్ సత్యమూర్తితో హిట్ కొట్టిన త్రివిక్రమ్.. ఈ సినిమా తర్వాత కొంచెం విరామం తీసుకున్నాడు. ఈ సినిమా విడుదలై దాదాపు నాలుగు నెలలు కావొస్తోంది. అయినా తన తర్వాతి సినిమా విషయంపై ఇప్పటి వరకు ఒక్క ప్రకటన అయినా చేయలేదు. అయితే ఈ మాటల మాంత్రికుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించాడని.. అది వర్కౌట్ కాకపోవడంతో సమంతతో లేడీ ఓరియెంటెడ్ తెరకెక్కించాలని అనుకున్నాడని వార్తలు వచ్చాయి. చివరికి అది కూడా కార్యరూపం దాల్చకపోవడంతో.. యంగ్ హీరోతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా కోసం నాగచైతన్య పోటీపడగా.. నిర్మాతకు బంపర్ ఆఫర్ ఇచ్చి ఆ లక్కీఛాన్స్ పట్టేశాడు నితిన్. ఇలా సెట్ అయిన ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. నితిన్ బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే కథను ఇప్పటికే సిద్ధం చేసిన త్రివిక్రమ్.. సెప్టెంబర్ నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్- నితిన్ కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్న నితిన్.. ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాడు. తన కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని భావిస్తున్న ఈ యంగ్ హీరో.. ఎప్పుడెప్పుడు షూటింగ్ స్పాట్ లో అడుగుపెడదామా అని ఆరాటపడుతున్నాడు. ఈ సినిమాను కూడా సన్నాఫ్ సత్యమూర్తిలా సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నారట మూవీ యూనిట్. మరి లవర్ బాయ్ నితిన్ తో త్రివిక్రమ్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు







